మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెడుతున్నారని అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
సోమవారం ఉదయం ఆయన శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత గిలకలదిండి ప్రాంతానికి చెందిన ఒక మహిళ తాను మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్యకార్మికురాలిగాపనిచేస్తున్నానని ,తనను మునిసిపల్ పాఠశాలలో శానిటరీ ఉద్యోగిగా మార్చాలని కోరింది. అలాగే తన 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలను మచిలీపట్నం లోని కాన్వెంట్ కు పంపాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది స్పందించిన మంత్రి పేర్ని నాని ఆమెతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు గతంతో సరిపోల్చితే, ప్రస్తుతం ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నందున విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్నారు.
స్థానిక వలందపాలెంకు చెందిన కొప్పుల వాణి అనే మహిళ మంత్రి వద్ద తనసమస్యను చెప్పుకొంది. తన భర్త తాపీ పనిచేస్తూ, సిమెంట్ వంటికి సరిపడకపోవడంతో ఎలర్జీ సోకిందని పనికి వెళ్ళలేని పరిస్థితులలో కుటుంబపోషణ ఎంతో భారంగా మారిందని డిగ్రీ చదివిన తనకు ఏదైనా ఉద్యోగం దయతో ఇప్పించాలని అభ్యర్ధించింది.
స్థానిక 8 వ డివిజన్ కు చెందిన 87 సంవత్సరాల వృద్ధుడు అబ్దుల్ వహీద్ మంత్రిని కలిశారు. తనకు కంటి ఐరీష్ , చేతి వేలిముద్రలు సరిగా పడకపోవడం చేత రెండు నెలలుగా వృద్ధ్యాపు పింఛన్ అందడం లేదని చెప్పారు. మంత్రి పేర్ని నాని ముసిసిపల్ కమీషనర్ శివరామకృష్ణతో ఈ విషయమై మాట్లాడారు. కంటి ఐరీష్ , చేతి వేలిముద్రలు మూడుసార్లు పరీక్షిస్తారని ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులలో ఎవరికైనా అతింటికిషన్ ఇస్తారని అప్పుడు ఆయన పింఛన్ వారికి ఇస్తారని ఆయన చెప్పారు.
తన భార్య ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిందని అయితే మరణ దృవీకరణ పత్రం అక్కడ ఇవ్వడం లేదని గండ్ర యాకోబు మంత్రికి పిర్యాదు చేశారు. బ్రాడ్ డెడ్ కు ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇవ్వరని, భౌతికదేహాన్ని ఒకవేళ ఇంటికి తీసుకువెళితే, పంచాయతీ లేదా మునిసిపాలిటీ లో ఆ మరణాన్ని నమోదు చేసుకొంటారని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలో బెడ్ ఇచ్చిన తర్వాత ఆమె చనిపోయారా దారిలో చనిపోయారా అని మంత్రి అడిగారు. తనకు సరిగా తెలియదని, పిల్లలకు తెలుసనీ గండ్ర యాకోబు తెలిపారు. ఆ విషయం తెల్సినవారితో రావాలని మంత్రి పేర్ని నాని ఆయనకు సూచించారు.
స్థానిక ఖాలే ఖాన్ పేటకు చెందిన ఏసమ్మ అనే మహిళ మంత్రి వద్ద తన సమస్య చెప్పింది. కొన్నేళ్ల క్రితం తన భర్తకు తమరే ఉద్యోగం ఇప్పించారని, బళ్లదొడ్డిలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని, వయస్సు మీరడంతో సరిగా పనిచేయలేకపోతున్నావంటూ అక్కడ అధికారులు అంటున్నారని ఆయనకు బదులుగా డిగ్రీ , లా చదివిన తన కుమారుడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్ధించింది.
Tags machilipatnam
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …