విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“కాలేజీ లవ్ స్టోరీ” సినిమా ముహూర్తాన్ని సోమవారం ఉదయం 9:30 గంటలకు చిత్ర యూనిట్ విజయవాడ గాంధీ నగర్ లో తమ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ జొన్నవిత్తుల రామకృష్ణ మాట్లాడుతూ యూత్ కు సంబంధించిన లవ్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాను ప్రారంభించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సిహెచ్. సురేష్, హీరో అక్షర, హీరోయిన్ లావణ్య, ఎడిటర్ శశాంత్ తదితరులు పాల్గొన్నారు.