విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, బందర్‌రోడ్డులోని బృందావన్ కాలనీలో నూతనంగా రమ ఫ్యాబ్రిక్స్ అనే నూతన స్టోర్స్‌ను సంస్థ అధినేత హరీష్ కమల్ మార్చి 9న ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ కమల్ మాట్లాడుతూ ఇది ఎక్స్‌క్లూజివ్ ఫ్యాబ్రిక్స్ స్టోర్ అని, కస్టమర్స్ దేవుళ్ళ ఎక్స్‌పీరియన్సే మోటాగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ స్టోర్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే అన్ని స్టోర్స్కంటే డిఫరెంట్‌గా దీనిలో కస్టమర్సే తమంతట తామే నేరుగా సెలక్షన్స్ చేసుకునే విధంగా డిజైన్ చేశామని, అలాగే ఇంటీరియల్స్ గాని అవుడోర్లో గాని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగే విధంగా ఏర్పాటుచేశామని అందుకే కస్టమర్స్ అందరూ ఒక సందర్శించి నూతన అనుభూతిని పొందాలన్నారు. ఇక్కడ వివిధ క్వాలిటీలలో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, మ్యాచింగ్స్, జార్జెంట్, శాటిన్, క్రేప్, పింటెడ్, ఎంబ్రాయిడరీ వర్క్, డ్రెస్సెట్స్, లెహెంగాస్ కావలసిన అన్నిరకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయన్నారు. 4 ఫ్లోర్ ఓరియెంటెండ్గా ఒక్కొక్క ఫ్లోర్స్‌లో కేటగిరీగా ఒక్కొక్క విభాగాన్ని సెట్ చేశామన్నారు. సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 9 నుండి 16 వరకు ప్రతి కొనుగోలుదారు కొనుగోలు పై 10 శాతం అంటే సుమారు 1200 కొంటే 120 రూపాయిలు క్యాష్ కూపన్ వస్తుందన్నారు. ఆ కూపన్ ఖరీదును ఏప్రిల్ 1 నుండి 15 లోపు మరలా కొనుగోలు చేసినపుడు దానిని వినియోగించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా కొనుగోలుదారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …