Breaking News

తిరుమలలో ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు…

తిరుమల, తిరుమల
తిరుమలలో ఏప్రిల్‌ 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో టీటీడీ ఆలయం వెనుక భాగంలోని వసంతమండపంలో ఈ ఉత్సవాలు నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కొవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈసారి వసంతమండపంలోనే భక్తుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణంగా ఏటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పూర్ణమికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. వసంతోత్సవాలను నిర్వహించే మండపాన్ని నందన వనంలా శోభాయమానంగా అలంకరించనున్నారు. లోపలిభాగంలో స్వామివార్లకు అభిషేకం నిర్వహించే వేదికను పూర్తిగా వట్టివేరుతో అలంకరిస్తారు. అడవిలోనే ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు సెట్టింగు వేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *