Breaking News

తెలుగు వినోద రంగంలో సరికొత్త సంచలనం


-ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓటీటీ అండ్ ఏటీటీ “రియల్ ఫ్లిక్స్”
-ఏపీ సినీ రాజధాని విశాఖ వేదికగా ఏషియన్ మీడియా 24 ఆధ్వర్యంలో సరికొత్త ఓటీటీ-ఏటీటీ ఫ్లాట్ ఫామ్
-‘ఎనీ టైమ్ థియేటర్’ కాన్సెప్ట్ తో ముందెన్నడూ లేని స్థాయిలో వినోదం
-రియల్ ఫ్లిక్స్ లోగోను ఆవిష్కరించిన సినీ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి
-లోగో ఆవిష్కరణలో సందడి చేసిన బాలీవుడ్ భామలు
-ఏపీ నుండే అన్ని కార్యక్రమాలు….చైతన్య జాంగా & విజయ్ వర్మ
-ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రేక్షకుల ముందుకు రియల్ ఫ్లిక్స్
-సరికొత్త సినిమాలు, వినూత్నమైన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు వినోదాల పండుగ
-ప్రతిభావంతులకు రియల్ ఫ్లిక్స్ ప్రోత్సాహం
-ఏషియన్ మీడియా 24 అధినేత నాగేంద్రబాబు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వినోద రంగంలో సరికొత్త సంచలనం ఆవిష్కృతమవుతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల కోసం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓటీటీ-ఏటీటీ వేదిక సిద్ధమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యాధునిక హంగులతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ‘రియల్ ఫ్లిక్స్’ రూపుదిద్దుకుంది. సరికొత్త సినిమాలు, వినూత్నమైన వెబ్ సిరీస్ లు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రియాలిటీ షోలతో వైవిధ్యభరితమైన రీతిలో వినోదాన్ని అందించేందుకు విజయవాడకు చెందిన ఏషియన్ మీడియా 24 సంస్థ రియల్ ఫ్లిక్స్ ఓటీటీ అండ్ ఏటీటీ ఫ్లాట్ ఫామ్ ను ఆవిష్కరించింది. మన ఇంట్లో, మనం కోరుకునే సమయంలో, మనకు నచ్చే వినోదాన్ని అందించేందుకు ‘ఎనీ టైమ్ థియేటర్’ కాన్సెప్ట్ తో ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్ టాప్, టీవీల్లో వినోద కార్యక్రమాలను వీక్షించేలా రియల్ ఫ్లిక్స్ యాప్ రూపొందింది. సంప్రదాయ ఓటీటీ వేదికలకు దీటుగా ఏషియన్ మీడియా 24 సంస్థ ఆవిష్కరించిన రియల్ ఫ్లిక్స్.. తెలుగు వినోద రంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది. పలు విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా, సినీరంగంలో అనేక విజయాలను సాధించి, విశేష పేరు ప్రఖ్యాతులను గడించిన నాగేంద్ర బాబు సారథ్యంలో రియల్ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులకు ముందెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన వినోదాన్ని అందించనుంది. ఆంధ్రప్రదేశ్ సినీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం నుండి తొలి అడుగు వేస్తున్న రియల్ ఫ్లిక్స్.. నవ్యాంధ్రలో మొట్టమొదటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా నిలుస్తోంది.

తెలుగు ప్రేక్షకుల కోసం వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న రియల్ ఫ్లిక్స్ లోగోను దిగ్గజ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఏషియన్ మీడియా 24 అధినేత నాగేంద్రబాబు సారథ్యంలో, నగరంలోని హోటల్ కారుణ్య రెసిడెన్సీలో జరిగిన రియల్ ఫ్లిక్స్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు అంకిత బ్రహ్మ, అనీషా ముఖర్జీ, రీనా మహాజన్, స్నేహ షా తదితరులు పాల్గొని సందడి చేశారు. రియల్ ఫ్లిక్స్ ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపిన హీరోయిన్లు.. తెలుగు వినోద రంగంలో రియల్ ఫ్లిక్స్ సంచలనాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రేక్షకులకు అత్యద్భుతమైన వినోదాన్ని అందించేందుకు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో రియల్ ఫ్లిక్స్ ఓటీటీ-ఏటీటీ వేదికను ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు. తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఆహ్లాదకరమైన వినోదాన్ని అందిస్తూ రియల్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఎస్వీ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు.

రియల్ ఫ్లిక్స్ ఆవిష్కర్త నాగేంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు వినూత్నరీతిలో వినోదాన్ని అందించాలనే సంకల్పంతో రియల్ ఫ్లిక్స్ ఓటీటీని ప్రారంభిస్తునట్లు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా రియల్ ఫ్లిక్స్ ఓటీటీని ఆంధ్ర ప్రేక్షకులకు లాంఛనంగా అంకితం చేస్తున్నామని ప్రకటించారు. రియల్ ఫ్లిక్స్ ను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు అనేక ఆకర్షణీయమైన వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త తరహా కథాకథనాలతో మొగుడు కావాలి, ఎక్స్ యూజ్ అనే వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నామని, హనీ ట్రాప్, ప్రియమైన శత్రువు, డర్టీ గర్ల్, వెంటాడే నీడ, సైకో కిల్లర్ తదితర వెబ్ చిత్రాలను, రియాల్టీ షోలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. సరికొత్త ఓటీటీ వేదిక అయిన రియల్ ఫ్లిక్స్ ద్వారా కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయాలనుకుంటున్న ప్రతిభావంతులైన రచయితలు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అద్భుతమైన ఆలోచనలతో తమను సంప్రదించి, ఫిల్మ్ మేకర్ కావాలనే కలలను సాకారం చేసుకోవచ్చని వినోద రంగంలో రాణించాలని కలలు కంటున్న యువతకు భరోసా ఇచ్చారు. ప్రతిభను ప్రోత్సహించి అవకాశాలు కల్పించడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని నాగేంద్ర బాబు ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు వారి కోసం తెలుగు నేలపై అంకురించిన సరికొత్త ఓటీటీ-ఏటీటీ వేదిక రియల్ ఫ్లిక్స్ ను తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని నాగేంద్ర బాబు కోరారు. ప్రేక్షకాభిమానుల అభిరుచులకు అనుగుణంగా వినూత్నమైన కార్యక్రమాలను, సరికొత్త చిత్రాలను అందిస్తామని ఆయన తెలియజేశారు.

ఏపీ నుండే అన్ని కార్యక్రమాలు..
చైతన్య జాంగా & విజయ్ వర్మ :
ఏపీ నుండి ప్రారంభిస్తున్న ఈ తోలి ఓ టీ టీ రియల్ ఫ్లిక్స్ అన్ని ప్రీ ప్రొడక్షన్, మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సంపూర్ణం గా ఆంధ్రప్రదేశ్ కేంద్రం గా జరగనుండడం ఆనందదాయకమని ఫిలిం అండ్ టెలివిషన్ కౌన్సిల్ అధ్యక్షులు చైతన్య జంగా సినీ నిర్మాత ఛాంబర్ ఉపాధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటి అభిప్రాయపడ్డారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *