అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక కేంద్రమైన లేపాక్షిని ప్రపంచ వాఫసత్వ సంపద కట్టడంగా యునెస్కో గుర్తించడం శుభపరిణామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభ్యుదయ క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ఒక ప్రకటనలో పేర్కోన్నారు. లేపాక్షిని యునెస్కో గుర్తించడం భారతదేశానికే గర్వకారణమని ఆయన తెలిపారు. విజయనగరం రాజుల కాలంలో నిర్మించిన వీరభద్ర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందన్నారు.వేలాడే సంభం, ఏకశిలా నంది, శిల్పాలు, కట్టడాలు,కళాఖండాలు.సీతాదేవి పాదాలు,ఏడు శిరస్సులపై నాగేంద్రుడు దేశంలో ఎక్కడ కనిపించవని మంత్రి అవంతి శ్రీని వాసరావు తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషి ఫలించిందన్నారు. ముఖ్యమంత్రి చొరవ, కేంద్రప్రభుత్వ సహకారంవల్లే లేపాక్షికి ఒక గుర్తింపు లభించిందన్నారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు.
Tags amaravathi
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …