విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత నెలరోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడులు సత్పలితాలు ఇస్తున్నాయి. వంటనూనెల ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలో 795 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 270 కేసులు నమోదు చేశామని, వీటిలో మూడు దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ అధికారి టి. కనకరాజు అన్నారు. నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా, తూకంలో తేడా ఉన్నా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో తూనికలు కొలతలు, పౌరసరఫరాలశాఖ టీమ్ సభ్యులు గురువారం నగరంలోని కృష్ణలంక, కానూరు, అయ్యప్పనగర్, గుణదల, పంట కాలవ రోడ్డులోని పలు నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి వంటనూనెల ఎమ్మార్పీ ధరలను, సరుకుతూకం పరిశీలించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ జిల్లా,నగరంలో పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సామాన్య కొనుగోలుదారులవలె దుకాణాలలో వంటనూనెలు కావాలని, వారు చెప్పిన ధర ఎమ్మార్పీ ధరలను సరిచూసుకొని వాటి మధ్య తేడా ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. నిర్దేశిత ఎంఆర్పీ ధరలకే సరుకులను కొనుగోలు చేశారా, అని వినియోగదారులను అడిగి తెలుసుకుంటున్నారు. వంటనూనెలను ఎంఆర్పి ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణాల నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు.కందిపప్పు,మినపప్పు, నూనెలను అక్రమంగా నిల్వచెసి బహిరంగ మార్కెట్లో కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …