విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్ పరిశరాలను పచ్చని మొక్కలతో ఆహ్లదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పరిశరాలలో జరుగుతున్న పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు , డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో వివిధ విభాగాల నిర్మాణాల తుది పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచి పచ్చని మొక్కలతో అందరిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. రంగు రంగుల మొక్కలతో ప్రాంగణం అంతటా నింపాలన్నారు. కలెక్టరేట్‌కు రాకపోకలు నిర్వహించే ప్రధాన రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల క్రోటన్ మొక్కలతో నింపాలన్నారు. చూపరులను ఆకట్టుకునే విధంగా కలెక్టరేట్ ప్రాంగణం ఉండాలని కలెక్టర్ ఢల్లీిరావు అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …