Breaking News

సంక్షేమ పథకాల అమలులో సువర్ణాధ్యాయం వైసీపీ పాలన:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సువర్ణాధ్యాయం లిఖించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ పోలీసు లైన్ రోడ్డు ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, గ్రామ వార్డ్ సచివాలయల పనితీరు గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో ఎవరికైనా ఏదైనా లబ్ది కావాలి అంటే కార్యాలయాల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ కళ్ళారిగెల తిరిగి లంచాలు ఇస్తే గాని ఆ పని పూర్తి అవదు అని,జన్మభూమి కమిటీల పేరుతో అక్రమ వసూళ్లు, అవినీతి దందాలు చేసారని కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, పెన్షన్ పంపిణీ చెప్పేడుతున్నారని,మీకు అర్హత ఉంటే కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా లబ్ది చేకూరుస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు తప్ప ప్రజలకు చేసిన మంచి ఏమిటి అని ప్రశ్నించారు. ఆయన నివాసం వుండే ఈ డివిజన్ లోనే అభివృద్ధి చేయలేదు అని,వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి 12వ డివిజన్లో డ్రైనేజ్ నిర్మాణం, రోడ్లు నిర్మాణం,ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,ఈ డివిజన్ లో పార్కు ల అభివృద్ధి, ఉర్దూ స్కూల్ కు సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ ఘనత అని అన్నారు. పెద్దలు  కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని గత టీడీపీ ప్రభుత్వం లో తొలగించి మరలా ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి వారే వినతిపత్రం ఇవ్వడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. టీడీపీ వాళ్లు చేసిన తప్పులను వాళ్లు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు అనే విషయం టీడీపీ వాళ్లు గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ప్రజలలో జగన్ గారి మీద రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది అని, అందుకే ప్రజలకు వాస్తవాలు వివరించి వారిలో నెలకొన్న అపోహలను తొలగించడానికి ఈ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టినట్లు అవినాష్ తెలిపారు.పర్యటన లో ప్రజలు ఎదురొచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని,వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని,వారి సంతోషం చూస్తుంటే జగన్ నాయకత్వం లో పని చేస్తూన్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జి మాగంటి నవీన్, అధ్యక్షులు రిజ్వాన్, వైస్సార్సీపీ నాయకులు కాళీ,చిన్న,రాజేష్,బషీర్,కార్పొరేటర్లు అంబేద్కర్, చింతల సాంబయ్య,మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *