విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10న బీసెంట్ రోడ్డులో జరిగే 67వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తప్పక విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, బీసెంట్ రోడ్డు వర్తక సంఘం సభ్యులు నాడార్స్ శ్రీను, సునీల్, రంగనాథ్, కృష్ణ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …