విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనందరికీ ఆదర్శప్రాయుడని.. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజని తెలియజేశారు. రామరాజ్యం తరహాలో మంచి పాలన అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి రాముల వారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …