తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక చెంచుపేటలో కేరళ వ్యాపారవేత్తలు నూతనం గా ఏర్పాటు చెందిన బెస్ట్ బేకరీ, స్వీట్స్ సంస్థను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ కాలేదా నసీమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలిలో బేకరీ ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నాణ్యమైన ప్రదార్ధాలను, భిన్నమైన రుచులతో అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. వ్యాపారంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు షీహాబ్, ముస్తఫా, నూఫాల్, ఫసల్ , కౌనిలర్లు జి. మానస రెడ్డి, బోయపాటి అరుణ, దర్శకుడు రత్నాకర్, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …