విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార ప్రధాన కమీషనర్ పి.రమేష్ కుమార్ నేతృత్వంలోని కమీషనర్ల బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో కమీషన్ కార్యకలాపాలను గురించి గవర్నర్ కు వివరించారు. కమీషన్ ప్రారంభమైన నాటి పరిస్ధితులు, ప్రస్తుతం కమీషన్ పనిచేస్తున్న తీరు, ఎన్ని కేసులు పరిష్కరించారు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. మరింత మెరుగైన సేవకు అవసరమైన అంశాలను కూడా బిశ్వభూషణ్ హరి చందన్ కు వివరించారు. అతి త్వరలో వార్షిక నివేదికను అందచేయనున్నామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సామాన్యుడికి మేలు చేసే ఉద్దేశ్యంతో సమాచార కమీషన్లు ఏర్పడ్డాయని, ఆదిశగా సాధ్యమైనంత మేరకు సేవ చేయాలని పిలుపు నిచ్చారు. సమాచార కమీషనర్లు ఎం.రవి కుమార్, బివి రమణ కుమార్, ఐలాపురం రాజా, కె. చెన్నారెడ్డి, ఆర్ శ్రీనివాసరావు కమీషన్ కార్యదర్శి సాంబశివ రాజు, న్యాయ కార్యదర్శి శ్రీనివాసులు, ఉప కార్యదర్శి తుమ్మల ఉమాజ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …