విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఛైర్మన్ / రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీల హక్కుల కోసం వారి సాధికారత కోసం కృషి చేసిన మహానుభావులని, తరతరాలుగా కులంపేరుతో అణచివేతకు గురౌతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని అతని ఆశయాలకోసం రాజ్యాధికారం కోసం ప్రతిఒక్కరు పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మి, యూత్ నాయకులు వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …