మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. జ్యోతిబాపూలే 196 వ జయంతి సందర్బంగా సోమవారం స్థానిక వలందపాలెం సాంఘిక సంక్షేమ వసతి గృహం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, మచిలీపట్నం నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా పలువురు కార్పొరేటర్లతో కలిసి జ్యోతిబాపూలే కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు సంక్షమమే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సమతావాద దార్శనికుడని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సంఘ సంస్కర్తగా బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి అని నేటి యువత జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగలన్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మాపూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని ఆయన తెలిపారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మాఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగా ప్రభుత్వం అమలు చేస్తున్నదని కలెక్టర్ రంజిత బాషా తెలిపారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …