వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న మహిళలు : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ కరివేపాకు తోట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును,చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13రోజులు గా ఈ డివిజన్ లో చేపట్టిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈరోజుతో పూర్తి అయ్యింది అని,డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పనితీరును, అభివృద్ధి కార్యక్రమాలు ను వివరించడం జరిగిందని, ప్రభుత్వం మీద అక్కసుతో కేవలం వారి రాజకీయ మనుగడ కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకుల నిజ స్వరూపం ప్రజలకు వివరించి వారిలో నెలకొన్న అపోహలను తొలగించమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 6 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, ఉర్దూ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని,అందుకే మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల మధ్యలో తిరుగుతున్నామని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ వాళ్ళ లాగా శంకుస్థాపన లు చేసి పనులు వదిలేయకుండా అవి పూర్తి అయ్యేవరకు నిత్య పర్యవేక్షణ చేస్తున్నామని,టీడీపీ నాయకులు కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ నివాసం వుండే డివిజన్ అయిన సరే ఎపుడైనా ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకున్నార అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ డివిజన్ లో అభివృద్ధి జరిగిందని,అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాదే అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, వైస్సార్సీపీ నాయకులు రిజ్వాన్,దనేకుల కాళీ,ఖలీమ్,బషీర్,చిన్న, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు,కార్పొరేటర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *