అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలోని మూడో బ్లాక్ లో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, పర్యావరణం, విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కేటాయించిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా. రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తాము. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు. సీఎం వైయస్ జగన్ అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా అటు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువస్తామని, అలాగే ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు. కేబినెట్ కూర్పు వల్ల పార్టీలో ఎటువంటి అసంతృప్తులు లేవని అన్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో అందరికీ గుర్తింపు ఉందని, ప్రతి ఒక్కరికీ సరైన గౌరవం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …