Breaking News

గుంటతిప్ప మరియు పుల్లేటి డ్రెయిన్ల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు

-మురుగునీటి పారుదల సక్రమముగా పారేలా చర్యలు చేపట్టాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి గుంటతిప్ప డ్రెయిన్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. కానూరు శ్రీ శక్తీ ఫంక్షన్ హాల్ నుండి రైవస్ కాలువ వరకు గల మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానమును పరిశీలిస్తూ, మురుగునీటి పారుదలకు అవరోధకరంగా డ్రెయిన్ నందు పేరుకుపోయిన చెత్త వ్యర్ధములు పూర్తి స్థాయిలో తొలగించాలని, వారంలో ఒక రోజు జె.సి.బి ద్వారా పూర్తి స్థాయిలో డ్రెయిన్ శుభ్రపరచుటకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ యొక్క స్దితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుటకు అవసరమైన చోట్ల సి.సి. కెమెరా మరియు మురుగునీటి తీవ్రత పరిశీలనకై సెన్సెర్ లను ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రెయిన్ నుండి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోనుటతో పాటుగా కేవలం శ్రీ శక్తీ ఫంక్షన్ హాల్ నుండి కాకుండా వేరొక మార్గముల ద్వారా మేజర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టి రైవస్ కాలువ కలిపే విధంగా నగరపాలక సంస్థ మరియు PR డిపార్టుమెంటు అధికారులు సంయుక్త పర్యటన చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ పై పూర్తి స్లాబ్ లు వేసి అక్కడక్కడ వ్యర్ధములను తొలగించుటకు వీలుగా మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంట తిప్ప డ్రెయిన్ మరియు పుల్లేటి డ్రెయిన్ లలో అవసరమైన చోట్ల గ్రేట్టింగ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పుల్లేటి డ్రెయిన్ నకు సంబందించి గుణదల ప్రాంతములో నిర్మాణం చేపట్టవలసిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ, డ్రెయిన్ నిర్మాణము మరియు గ్రేట్టింగ్ ఏర్పాటుకు అవసరమగు అంచనాలు తాయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటుగా మేజర్ డ్రెయిన్ నందు పాడైన చోట్ల డ్రెయిన్ మరమ్మత్తులు నిర్వహించుటకు తగిన ప్రణాళికలను సిద్దం చేయాలనీ అధికారులకు సూచించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేకర్, హెల్త్ ఆఫీసర్ డా.బి శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఎల్. పార్ధసారధి మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *