Breaking News

మహావీర్ జయంతి సందర్భంగా 14న మాంసం విక్రయాలు బంద్

-కబేళ మూసివేత- నిభందనలు ఉల్లగించిన వారిపై చర్యలు
-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఉత్తర్వులు ననుసరించి ది. 14-04-2022 మహావీర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికి సెలవు ప్రకటించడమైనది. నగరంలో ఉన్న కబేళ కు కూడా సెలవు ప్రకటించడమైనది. ఎవరైనా నిభందనలను పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన యెడల చట్ట ప్రకారం కమిషనర్ వారి ఉత్తర్వులు మేరకు చర్యలు తీసుకోవటం జరుగునని వి.ఏ.ఎస్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు.

అదే విధంగా నగర వీధులలో ఇష్టానుసారంగా పశువులను (ఆవులు) వదిలి వేయుట కారణంగా పారిశుధ్య నిర్వహణకు మరియు ప్రజల, వాహనముల రాకపోకలకు తీవ్ర అవరోధం కలుగుతున్న దృష్ట్యా గోవుల యాజమానులు తమకు సంబందించిన గోవుల రోడ్లపై సంచరించకుండా చూడాలని హెచ్చరిస్తూ, ఆదేశాలు పాటించ యెడల నగరపాలక సంస్థ తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *