-నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖమాత్యులు గా భాద్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్ ని నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గురువారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి ఫ్లోర్ నందలి మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చన్ని అందించి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా విజయవాడ నగరాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో సహాయ సహకారులు అందించాలని కోరారు.