ఆంధ్రప్రదేశ్ బైండ్ల సంఘం కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బైండ్ల కులస్తులను గుర్తించి సముచిత న్యాయం చేయాలని, బైండ్ల కులస్తులకు రాష్ట్ర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బైండ్ల సంఘం అధ్యక్షులు మందపాటి పాపారావు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బైండ్ల నూతన సంఘం ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఎస్సీ కులములో బైండ్ల ఉప కులముగా ఉన్నామని, అనాదికాలము నుండి గ్రామాలలో క్రతువులు నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.బైండ్ల లను కళాకారులగా గుర్తించి పింఛన్లు ఇవ్వాలని వారు కోరారు. తమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మముల్ని గుర్తించి సముచిత న్యాయం కల్పించారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా తమకు సముచిత న్యాయం కల్పించాలని కోరారు. బైండ్ల కులస్తులను రాజకీయంగా, ఆర్థికంగా సముచిత న్యాయం కల్పించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి బైండ్ల కులస్తులను ఒకే తాటి మీద తీసుకువచ్చి బైండ్ల లకు న్యాయం చేసేవరకు కృషిచేస్తామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *