Breaking News

జిల్లాలో మూడవ విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ. 38.49 కోట్ల పంపిణీ…

-సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి జోగిరమేష్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎన్‌టిఆర్‌ జిల్లా కు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో సున్నా వడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాష్ట్ర గృహానిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, శాసన మండలి సభ్యులు టి. కల్పలత, యండి. రహూల్లా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిలు లబ్దిదారులకు చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి మహిళాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రజా సంకల్స యాత్రలో స్వయం సహాయ సంఘ మహిళల ఇబ్బందులను చూసి చలించి మహిళల ఉజ్వల భవిషత్‌ కోసం వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి అమలు చేయడం జరగుతుందన్నారు. ముఖ్యమంత్రి మహిళా సంక్షేమ కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి స్వయం సహాయ సంఘాలకు ఇస్తున్న బ్యాంకు రుణాల వడ్డీ రెట్లు తగ్గించడంతో పాటు సున్నా వడ్డీ కే రుణాలను అందజేస్తున్నారన్నారు. దీని ద్వారా సంఘ సభ్యులు ఆర్థిక పరిపుష్టిని సాధించడం జరుగుతుందన్నారు.
మాజీ మంత్రి, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ కార్యక్రమం ఇప్పటికే రెండు విడతలలో పంపిణీ చేయడం జరిగిందని, అర్హత గల మహిళ స్వయం సహాయ సంఘాలకు ఈ సున్నా వడ్డీ పథకంలో సొమ్మును నేరుగా అక్కచెల్లమ్మల తరుపున పారదర్శకంగా బ్యాంకు ఖాతాలో జయ చేయడం జరుగుతుందని అన్నారు.
సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణు వర్థన్‌ మాట్లాడుతూ ఈ సున్నా వడ్డీ పథకం వలన మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకునే చిన్నతరహ వ్యాపారాలు మరింత లాభదాయకంగా వడ్డీ భారం లేకుండా నడుపుకోవడానికి మెరుగైన జీవనం సాగించడానికి కూడా ఈ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మట్లాడుతూ అర్హతగల మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 35,799 స్వయం సహాయక సంఘాలోని 3,68,116 మంది సభ్యులకు రూ. 38.49 కోట్లు అందించడం జరుగుతుందని ప్రతీ మహిళ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సాదికారత సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి జె సునీత, మహిళ సమైక్య అధ్యక్షరాలు ఎస్‌ వెంకట కుమారి, స్థానిక నాయకులు దేవినేని అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *