అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య అని, అన్ని విద్య తరువాతి స్థానంలో నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ, సమాజంలో ఒక బాధ్యత యుతమైన వ్యక్తిగా మనం ఏది చెయ్యాలో అది చెయ్యాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరైనా 20 సమస్యలు పేర్కొన్న సందర్భంలో వాటిలో ఒక్క దానికైన పరిష్కారం చూపగల గాలన్నరు. ప్రతిదీ ప్రభుత్వం, అధికారులే చెయ్యాలనే ఆలోచన విడనాడి చొరవ తీసుకుని ముందుగుడు వేయాల్సి అవశ్యకత ఎంతైనా ముఖ్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం అయిన నందున ఆత్మ విశ్వాసం తో కూడి ఉండాలని జస్టిస్ పిలుపు నిచ్చారు. మానవ సంబంధాలను కలిగి ఉండాలని, అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. నేటికీ కనీస అవసరాలు కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు చూస్తున్నామని, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా, ఇటువంటి అంశాలపై తీవ్రంగా ఆలోచన చెయ్యాల్సి ఉందన్నారు. విద్యా ద్వారా అభివృద్ధి సాధ్యమని, విద్యా అనే ఆయుధం ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని ఆయన అన్నారు.

ఒక న్యాయవాదిగా, హై కోర్టు జడ్జి గా డి ఎస్ ఎస్ ఎ యొక్క కీలక పాత్ర గుర్తించ లేదని, తదుపరి రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించానని తెలిపారు. ప్రజల కోసం సేవా చేసేందుకు ఒక గొప్ప అవకాశం గా పదవి లభించిందని భావిస్తానని, ఒక పౌరునికి కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం గా పదవీని భావిస్తానని జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింభించేలా మీ నృత్య రీతులు ఆకట్టుకున్నాయ ని పేర్కొన్నారు. వాటిని సజీవంగా నిలిపేందుకు మీ కృషి అభనందనీయం అన్నారు.

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి – జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ – ఛైర్మన్ పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన, అందరికీ చేరువ లో న్యాయ సేవలు, ఉండాలన్న లక్ష్యాలతో డి ఎల్ ఎస్ ఏ పని చేస్తుందని ఆమె తెలిపారు. సమస్య ఏదైనా డి ఎల్ ఎస్ ఏ దృష్టికి తీసుకొని వొస్తే సహాయం చేయడం జరుుతుందన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అందచేస్తున్న కార్యక్రమాలు కు పథకాలు చేరువ చెయ్యడం లో కీలక బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు. డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుందనే భావనను కాకుండా అందరికి సమ న్యాయం కోసం పనిచేస్తుందని తెలిపారు.

జిల్లా కలక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, డి ఎల్ ఎస్ ఏ కి జిల్లా యత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాన్నారు. ఆర్థిక సాధికరత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యా దివేన, వసతి దీవెన, చేయూత వంటి ఎన్నో నగదు ప్రోత్సహక పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆర్థిక సాధకారత సాధించాలంటే సంక్షేమ పథకాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు.

ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ పరమైన అంశాలలో అండగా ఉంటున్నమన్నరు. ఎన్నో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకుని రావడం ద్వారా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి – జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ – ఛైర్మన్  పి. వెంకట జ్యోతిర్మయి, రాష్ట్ర డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎమ్.బబిత, సీనియర్ సివిల్ జడ్జి కం జడ్జి జిల్లా న్యాయ సేవ ధికార సంస్థ – సెక్రెటరీ కె.ప్రత్యుషకుమారి , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కూడా ఎస్పీలు ఐశ్వర్యరాస్తోగి, కే వి ఎస్ ఎస్ సుబ్బారెడ్డి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఇలాక్కియా, జీ. సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్లసుబ్బారావు, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, లా విద్యార్ధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *