అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ చిన్న రామాలయం, పోనమాల బజార్, నీళ్ల ట్యాంక్ రోడ్డు ప్రాంతంలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును,చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించారు. అవినాష్ మాట్లాడుతూ 70 లక్షలు పెట్టి పటమటలంక మెయిన్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. జాస్తి వారి వీధి నందు సైడ్ డ్రైన్,మసీదు సందు నందు కల్వర్టర్ మరియు పటమటలంక మెయిన్ రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు సమస్యలు ను పరివేక్షించి వి.ఎమ్.సి కమిషనర్ తో మాట్లాడి వీలు అయినంత త్వరగా నిధులు మంజూరు చెపిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.అదేవిధంగా పటమటలంక స్క్రూ బ్రిడ్జి రోడ్డులో నివసిస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వటమే కాకుండా సొంత ఇల్లులు వీలు అయినంత త్వరాగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా మరియు శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ డివిజిన్ లో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మరో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ లు టీడీపీ వారే అయ్యుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని ఎద్దేవాచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, టీడీపీ లాగా ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వల్లూరు ఈశ్వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు, జిల్లా ఫిషర్ మెన్ సొసైటీ డైరెక్టర్ ఖాళీ, రాష్ట్ర రజక సంఘ అధ్యక్షుడు శివయ్య, స్టాండింగ్ కమిటీ మెంబెర్ కలాపాల అంబెడ్కర్, తంగిరాల రామిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *