విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం-1 వద్ద నిర్వహించడం జరుగుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్. ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని సోమవారం (25.04.2022) ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో సచివాలయం-1 వద్ద ఉదయం 10.00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. ఇబ్రహంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామ ప్రజలు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించవచ్చునని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రతీ వారం స్పందన కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రతీ మండలంలోని ప్రధాన గ్రామంలో ఒక్కొక్క సోమవారం నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ జిఎస్ఎల్ ప్రవీణ్ చంద్ అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …