విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యనారాయణపురంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి వారు విచ్చేసి వటువులకు ఆశీస్సులు అందజేశారు. త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్రోపాసనం తప్పనిసరిగా ఆచరించాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు సూచించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వటువులపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొప్పవరపు బలరామకృష్ణమూర్తి, సెక్రటరీ తణుకు రామకృష్ణ, ఉపనయనం చేసుకున్న 27 మంది వటువులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …