ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ ద్వారా మరిన్ని సేవలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ జోనల్‌ మేనేజర్‌ మనీష్‌ కౌశల్‌ అన్నారు. ఆరోగ్య, వాహన ఇన్సూరెన్స్‌ రంగంలో తమ సంస్థ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని ఆయన వివరించారు. నూతన ప్రాంగణంలోకి తమ కార్యాలయాన్ని మార్పు చేసినట్లు ఆయన చెప్పారు. బందర్‌ రోడ్‌లోనే ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ కార్యాలయాన్ని ఆర్టీసీ కాలనీ ఫన్‌ టైమ్స్‌ రోడ్‌లోకి మార్చారు. శ్రీ విద్యా నిలయం మూడో ఫ్లోర్‌ లో నూతనంగా ఏర్పాటు అయిన సంస్థ కార్యాలయాన్ని జోనల్‌ మేనేజర్‌ మనీష్‌ కౌశల్‌, విజయవాడ శాఖ మేనేజర్‌ పీ.ఎస్‌.వి.ఫణికుమార్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్‌ రంగంలో ప్రత్యేక స్థానం ఉన్న తమ ఫ్యూచర్‌ జనరాలి సొల్యూషన్స్‌ కార్యాలయాన్ని ఫన్‌టైమ్స్‌ రోడ్‌లో నూతన ప్రాంగణంలోకి మార్చినట్లు తెలిపారు. ఆరోగ్య, వాహన విభాగాల్లో ఇన్సూరెన్స్‌లకు తమ సంస్థ పేరుగాంచిందన్నారు. కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహించినట్లు వారు వివరించారు. ఇన్సూరెన్స్‌రంగంలో ఉన్న ఇతర సంస్థలకు భిన్నంగా అందిస్తున్న మెరుగైన సేవల వల్లనే ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన గలిగామన్నారు. తమ సంస్థ ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏరియా హెడ్‌ సాయి వెంకట కిరణ్‌, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *