అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

-పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం
-మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆర్. టి. సి. వర్క్ షాప్ రోడ్డు, యస్. కన్వెన్షన్ హాల్ నందు 38, 39, 40, 41, 42, మరియు 52వ డివిజన్లకు సంబందించి నిర్వహించిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి 842 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. 1,18,52,335/- చెక్కులను అందజేసారు.

ఈ సందర్భంలో మాజీ మంత్రి మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం క్రింద పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 3వ విడతగా 3591 సంఘాల వారికీ రూ.4,89,48,502/- (నాలుగు కోట్ల ఎనబై తొమ్మిది లక్షల నలబై ఎనిమిది వేల ఐదు వందల రెండు ) అందించామని పేర్కొన్నారు. కరోనా లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేయలేదన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రధాన ధ్యేయంగా పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. సున్నా వడ్డీ పథకంతో మహిళలకు ఆర్ధిక సావలభన కల్పించే దిశగా ముఖ్యమంత్రి వర్యులు మహిళలకు అనేక పథకములను అమలు చేస్తూ, వారి జీవితాలలో నూతన వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిని ల‌క్షాధికారులుగా చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారని అన్నారు.

మహిళలకు ఆర్ధిక సావలభన కల్పించే దిశగా వై.ఎస్ ప్రభుత్వం
వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి
ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా అడుగులు వేస్తోన్న జగనన్న ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలు తోడ్పాటును అందించాలన్నారు. పొదుపు సంఘాలలో రుణాలు పొందిన పేద మహిళలు ఎంతో మంది చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. వారిపై వడ్డీ రూపంలో ఆర్థికభారం పడకూడదనే ఉద్దేశ్యంతో ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అక్కచెల్లెమ్మలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని, రాబోవు తరాల వారికీ కూడా సంక్షేమ పథకములు వెళ్ళాలి అంటే మనందరం మరలా అయన గెలిపించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. జగనన్న ప్రభుత్వం గత మూడేళ్ల కాలంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు. తదుపరి ఆయా డివిజన్ లకు సంబందించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం క్రింద మూడవ విడతగా 842 స్వయం సహాయక సంఘాలలోని 8420 మంది అక్కా చెల్లెమ్మలకు రూ. 1,18,52,335/- విలువైన చెక్కును ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి పంపిణి చేసారు. అనంతరం మేయర్ కార్పొరేటర్లతో కలసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

కార్యక్రమములో కార్పొరేటర్లు షేక్ రహమతున్నిసా, గుడివాడ నరేంద్ర రాఘవ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్, పడిగపాటి చైతన్య రెడ్డి, జోనల్ కమిషనర్ సుధాకర్, యు.సి.డి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *