నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 10.69 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 10.69 లక్షల విలువైన చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఇప్పటివరకు 881 మందికి రూ. 4 కోట్ల 8 లక్షల 60 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 84 మందికి రూ. 2 కోట్ల 18 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసిలను అందించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని.. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీకి పునర్వైభవం తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని జబ్బులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో భాగంగా 4 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను కూడా సిద్ధం చేసినట్లు మల్లాది విష్ణు వివరించారు. అలాగే వాంబేకాలనీలో మూడున్నర ఎకరాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటుకు టెండర్ల పిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లీశ్వరి, మోదుగుల తిరుపతమ్మ, జానారెడ్డి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్లు బెవర నారాయణ, గుండె సుందర్ పాల్, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఆర్.ఎస్.నాయుడు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *