-రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఏప్రిల్ 14 డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన్నట్లు మంత్రుల కమిటి చైర్మన్, రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున తెలిపారు.
స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను బుధవారం మంత్రుల కమిటీ చైర్మన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున, ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్ట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం పాత్రికేయులతో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రానున్న అంబేద్కర్ జయంతి నాటికి స్వరాజ్య మైదానంలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట, స్మృతి వనం పనులు పూర్తి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంచాలని అధికారులకు ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం విజయవాడ నడి బొడ్డున స్వరాజ్య మైదానంలో జరుగుతున్న పనులను మంత్రుల కమిటి పలు దపలుగా పరిశీలించి పనులు వేగవంతానికి ఆదేశాలు ఇస్తూన్నామన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 25 అడుగులా నమూన విగ్రహాన్ని పరిశీలించి చేయవల్సిన మార్పులను అధికారుల దృష్టికి తీసుకువచ్చామన్నారు. ప్రతీ 15 రోజులకు పనులను సమీక్షిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వరాజ్య మైదానాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా, ఆహ్లాదకమైన వాతావరణంలో పర్యటకులు నగర ప్రజలు స్మృతి వనాన్ని సందర్శించే విధంగా రుపుదీద్దుతున్నామన్నారు. సామాజిక అసమానతలు తొలగించి అణగారిన వర్గాలు వారికి ఉన్నత స్థితిని కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక నూతన పథకాలను రుపకల్పన చేసి అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారని మంత్రి అన్నారు.
ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 125 అడుగుల డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా రుపకల్పన చేసి స్మృతి వనం ప్రాజెక్టు పనులు ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసక్తి మేరకు ఆకర్షనీయంగా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రుల కమిటి సూచించిన మేరకు కొన్ని మార్పులు చేర్పులను పరిగణంలోకి తీసుకుని కాంస్య విగ్రహం, స్మృతి వనం పనులు నిర్థేశించిన కాల పరిమితి లోగా పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశించామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
తొలుత డా. బిఆర్ అంబేద్కర్ 25 అడుగుల నమూన విగ్రహానికి మంత్రులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ పనుల పరిశీలనలో ప్లానింగ్ సెక్రటరీ జివి ఎస్ కె.ఆర్ విజయకుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఇంజనీరింగ్ ఛీఫ్ సిహెచ్ ఎస్ ప్రసాద్, సాంఫీుక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్థన్, సామాజిక న్యాయ సలహాదారు జూపుడి ప్రభాకరరావు, ఎస్సి కమీషనర్ సభ్యులు కె. పుల్లరావు, సిహెచ్ అనంద్ ప్రకాష్, వైసీపి నాయకులు యడ్ల తాతజీ, పలువులు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.