Breaking News

మే ఆరో తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు…

-27,927 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు..
-27,149 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు..
-ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ…
-జిల్లాలో 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
-సి సి కెమెరాల నిఘాతో పర్యవేక్షణ…
-620 మందికిపైగా ఇన్విజిలేటర్లు.
-70 మంది చీఫ్ సూపరిండెంట్ లు, 70 మంది డిపార్ట్ మెంట్ అధికారుల నియామకం..
-5 సిట్టింగ్ స్కాడ్ ,రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు…
-జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 6 వ తేది నుంచి 24 తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మే 6 వ తేదీ నుంచి మే 24 వతేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలకు చేయవలసిన ఏర్పాట్లపై గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుంచి మ.12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు పరీక్షల నిర్వహణకు నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్ల్లు, డిపార్టుమెంటల్ అధికారుల శిక్షణ కార్యక్రమం లో తెలిపిన అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఏమైనా సందేహలుంటే నివృత్తి చేసుకోవాల న్నారు.
జిల్లాలో 55,076 మంది మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 27,927మంది,రెండవ సంవత్సరం పరీక్షలకు 27,149 మంది విద్యార్థులు హాజరు హాజరుకానున్నారు.ఈ పరీక్షలను సిసి కెమెరాల నిఘా తో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. 70 పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. తపాలా శాఖ సంబంధించి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ను ఆయా పరీక్షా తేదీల్లో నిర్దేశించిన సమయం వరకు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి ముందస్తుగా చెక్ లిస్ట్ ఏర్పాటుచేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా పరిశీలించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా, ఏఎన్ఎం లను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ ఎస్ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులకు సౌకర్యవంతంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు . పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీకి అవసరమైన వాహనాలను రవాణా శాఖ ద్వారా సమకూర్చాలన్నారు. పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, ఆర్ఐఒ పి. రవి కుమార్ ఆర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *