విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భగత్ సింగ్ రోడ్డులోని ఓ ఇంట్లో గత అర్థరాత్రి చోరీ జరిగిన ఇంటిని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు శుక్రవారం నగర పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరుపై సమీక్షించారు. ఇంటి యజమాని సుద్దపల్లి కృష్ణమూర్తికి భరోసా కల్పించారు. దొంగతనానికి పాల్పడ్డ వారిని గుర్తించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూడాలని సీసీఎస్ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును ఆదేశించారు. టెక్నికల్ టీమ్, క్రైమ్ డిటక్షన్ సిబ్బంది బాగా పని చేయాలని, అనుమానితులను విచారించాలన్నారు. సిసి కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని సూచించారు. నేరస్థలాన్ని పరిశీలించిన వారిలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, సీఐలు ఏ.శ్రీనివాస్, బాలమురళికృష్ణ, క్రైం ఎస్సై షరీఫ్, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, రంగబాబు, శనగవరపు శ్రీనివాస్, యల్లాప్రగఢ సుధీర్, చాంద్, కమ్మిలి రత్న, కూనపులి ఫణి ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …