విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రలోనే మహ పుణ్యక్షేత్రం సింహాచలం… శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు చిట్టనగర్ లో వేంచేసి వున్న శ్రీ పద్మావతి గోదాదేవి గరుడాచల స్థిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చందనం లేపనంగా పూస్తూ వుంటారని. అలయ కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు ప్రత్యేకత చెబుతూ ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియ నాడు చందనాన్ని స్వామివారికి ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి చందనపు లేపనంగా పూసి అలంకరించి భక్తులకు చూసే అవకాశాన్ని కలిపించారన్నారు. కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) మాట్లాడుతూ దీనిని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కార్యవర్గ సభ్యులు గూడేల రామకృష్ణ (ఆర్కే), పోతిన వెంకట ధర్మారావు, పణుకు రమ, కామందుల నరసింహారావు, పిళ్ళా విజయ్కుమార్, గర్రె మురళీకృష్ణ, పోతిన శ్రీనివాసరావు, మాకెన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …