అభివృద్ధి దిశగా తూర్పు నియోజకవర్గం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారితోట నందు స్థానిక కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దాదాపు 20లక్షల రూపాయలతో పార్కు మరియు 70లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైన్ అభివృద్ధి పనులకు నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు  బెల్లం దుర్గ,  అవుతూ శైలజారెడ్డి లతో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజిన్లో అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపన లకు పరిమితం కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా త్వరగా పూర్తి చేస్తున్నామని,ఆ మేరకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక 125 కోట్లతో రిటైనింగ్ వాల్ పనులు జరుగుతుంది అని వీలు అయినంత త్వరగా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *