Breaking News

జిల్లాలో జగనన్న విద్యా దీవెన ద్వారా 41,354 మంది విద్యార్థులకు 32 కోట్లు విడుదల

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాకు సంబంధించి 194 కళాశాలలో చెందిన 41,354 మంది విద్యార్థిని విద్యార్థులకు 32 కోట్ల రూపాయాలను విద్యార్థుల తల్లుల ఖాతాలలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా గురువారం జమ చేయనున్నట్లు కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 14 ఐటిఏ కళాశాలలు, 15 పాలిటెక్నిక్‌ కళాశాలలు, 65 డీగ్రీ కళాశాలలు, 32 ఇంజనీరింగ్‌ కళాశాలలు, 32 డిఇడి కళాశాలలు, 05 అగ్రికల్చరల్‌ కళాశాలలు, 20 వైద్య కళాశాలలు, 14 నర్సింగ్‌ కళాశాలలు, 02 బిఇడి కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా జనవరి, పిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి ఫీజులను చెల్లిస్తున్నట్లు తెలిపారు. వీరిలో 10,523 మంది ఎస్సీ విద్యార్థులు, 1,605 మంది ఎస్‌టి విద్యార్థులు, 16,796 మంది బిసి విద్యార్థులు, 5,861 మంది ఇబిసి విద్యార్థులు, 2,638 మంది ముస్లీం మైనారిటి విద్యార్థులు, 3,640 మంది కాపు విద్యార్థులు, 291 మంది క్రిస్టియన్‌ మైనారిటి విద్యార్థులు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్దిపొందుతున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *