ఫైనల్ బైఫర్ గేషన్ (విభజన) పూర్తి చేసిన డైరెక్టర్ డాక్టర్ కె.జగదీశ్వరీ చొరవ అమోఘం

-అభినందనలు తెలియజేసిన ఐ.పి.యం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఏడు సంవత్సరాలుగా ఐపీయం డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల కల నేటికీ నెరవేరిందని అందుకు చొరవ చూపిన డైరెక్టర్ కె జగదీశ్వరి వారికి ఆంధ్ర ప్రదేశ్ ఐపీయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినుకొండ రాజారావు అభినందనలు తెలియజేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి లోని డైరెక్టరేట్ లో తెలంగాణ అధికారులు ఆంధ్ర అధికారులతో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎస్ ఆర్).యల్.ప్రేమ్ చంద్రారెడ్డి రిటైర్డ్ ఐ.ఎ.యస్. వారు వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన అన్ని సింగిల్ పోస్టులను అలాగే డిపార్ట్ మెంట్ అభివృద్ధి కొరకు పట్టుబట్టి రాష్ట్రానికి రావాల్సిన పోస్టులను సాధించుటలో, మరియు తెలంగాణా స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపుటకు చూపిన చొరవ అమోఘమని, అదే సమావేశంలో అసోసియేషన్ పక్షంగా రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పూర్ణ చంద్రరావు, ఆనందరావు.యం.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ప్రసాద్, మహేష్, అశోక్, సంతోష్,సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *