ప్రభుత్వ పథకములు అన్న ప్రజలకు చేరువ చేయాలి…

-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్–1 కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ను పరిశిలించి ప్రజల నుంచి నగదు ఎలా కలెక్షన్ చేస్తునారో అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చినారు. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించే విధంగా స్వైప్ మిషేన్ ను ఏర్పాటు చెయ్యాలి అన్నారు. తదుపరి 47వ డివిజన్, లంబాడి పేట, కలరా హాస్పిటల్ నందలి 146 &151 వార్డ్ సచివలయలను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలో విధులు నిర్వహించు సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి భాద్యతగా తమకు కేటాయించిన విధులను నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకముల వివరాలు విధిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిస్ ప్లే బోర్డు నందు ప్రదర్శించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *