త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేయాలి…. : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

-మండలాల్లో మట్టి, ఇసుక, బుసక తరలింపు ఆరోపణలకు రెవిన్యూ అధికారులు స్పందించాలి
-రెవిన్యూ, పోలీస్, స్థానిక పంచాయతీ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి
-ఆర్ బి కె, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలకు స్ధలాలు త్వరితగతిన మంజూరు చేయాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్రస్థాయిలో విచారణ చేసి త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆర్డీవోలు, తహశీల్దార్లు సమన్వయంతో జగనన్న సంపూర్ణ గృహ పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి. రంజిత్ బాషా అధికారులకు ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ మహేష్ కుమార్ రావిరాల, డి ఆర్వో ఎం. వెంకటేశ్వర్లు తో కలిసి ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో జిల్లాలో ప్యూరిఫికేషన్ అఫ్ ల్యాండ్ రికార్డ్స్, రీ సర్వే, మల్టి పర్పస్ ఫెసిలిటీ సెంటర్ గొడౌన్స్, వివిధ పత్రికలలో వచ్చిన వివాదాస్పద కధనాలు, జగనన్న ఇళ్ల స్థలాల లే ఔట్లు, వన్ టైం సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై ప్రత్యక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం ద్వారా భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కానుందని తెలిపారు. జిల్లా అభివద్ధి చెందాలంటే అవసరమైన భూమి ఉండాలన్నారు. కృష్ణా జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఆర్‌డిఒలు, తహశీ ల్దార్లు సమన్వయంతో భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మే నెల 31 వ తేదీ లోగా వివిధ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి వివరాలను విఆర్ ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ముగ్గురు ఆర్డీవోలు, 25 మండలాల తహశీల్దార్లు, డిసిఓ, ఏ డి సర్వే, డ్వామా పిడి, జడ్పి సిఈఓ, , పంచాయతీరాజ్ ఎస్ ఇ , హోసింగ్ , ఫిషరీస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *