విశ్రాంత ఉద్యోగుల అవస్థలు, ఆవేదనను అధికారులూ అర్ధం చేసుకోండి…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటుపల్లి లోని రైల్వే వర్క్ షాప్ కాలనీలో గల రైల్వే ఆసుపత్రి వైద్యులు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ఓ మహిళా డాక్టర్ చాలా దారుణంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి, మాజీ ఏ ఐ ఆర్ ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొక్కరాల నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం గాంధీనగర్ ఏలూరు లాకుల వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ్ కార్యాలయంలో స్టాఫ్ సైడ్ డిపార్ట్మెంట్ కౌన్సిల్ (జే.సీ.ఎమ్) గౌరవ అధ్యక్షులు కె. వెంకట బలరామ్ కృష్ణ మూర్తి అధ్యక్షతన సౌత్ సెంట్రల్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇద్దరు మహిళా డాక్టర్లు ఉన్నారని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు చికిత్స నిమిత్తం వస్తే తాము సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సేవలు చేయడానికి ఉన్నామని విశ్రాంత ఉద్యోగులకు కన్సల్టేషన్ కొరకు డాక్టర్లను నియమించలేదని వ్యాఖ్యానించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులకు రక్తపోటు పరీక్షలు అటెండర్ చేత చేయిస్తున్నారని, నర్సుల చేత మందులు వ్రాయడం తప్ప ఆ వృద్ధుని ఆరోగ్య పరిస్థితిని చెప్పుకునేందుకు, వైద్యులు తెలుసుకునేందుకు ఇష్టపడడం లేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న వారు మంచం పై ఉన్న వారిని సైతం సొంత ఖర్చులతో వీల్ చైర్ లో అంబులెన్స్ లు ఏర్పాటు చేసుకొని రావాలని వ్యక్తిగతంగా ఆసుపత్రికి వస్తేనే మందులు ఇవ్వడం జరుగుతుందని హెచ్చరిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి లోపల నలుగురికి మించి ఉండరాదని, మిగిలిన వారంతా ఆస్పత్రి వెలుపల వేచి ఉండాలని, లోపల బెంచీలు పై సైతం కూర్చునేందుకు కూడా అనుమతించడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ సమస్యల దృష్ట్యా ఆ మహిళా డాక్టర్ ని రైల్వే అధికారులు ట్రాన్స్ఫర్ చేయగా మరల ఆ మహిళా డాక్టర్ తన పరపతిని, రాజకీయాన్ని ఉపయోగించి తిరిగి అదే చోట విధులు నిర్వహిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. ఒకే ఒక నెలలో ఆమె అదే ప్రాంతానికి మరల ఎలా వచ్చారో అందరికీ తెలిసునని కానీ ఏమి చేయలేని పరిస్థితులో అధికారులు మిన్నకుండిపోయారన్నారు.
ఇటీవల ఒక విశ్రాంత ఉద్యోగి జయరాజు తన మోటార్ సైకిల్ ఆసుపత్రి ఎదుట నిలిపినందుకు డాక్టరే స్వయంగా టైరు పంచర్ చేశారని ఆరోపించారు. వృద్ధులు కనీసం చెప్పులు వేసుకుని రావద్దని, ఆంక్షలు విధించి, బయట చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే ఉన్నత అధికారులు విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రికి సిటీలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యుల ద్వారా మందులు అందజేసే సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఆ మహిళా డాక్టర్ పై తగిన చర్యలు చేపట్టవలసినదిగా రైల్వే ఉన్నత అధికారులను కోరారు.సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గూటాల నాగేశ్వర రావు, బద్దె దివాకర్, జయరాజు, కనకయ్య, సి.హెచ్ లక్ష్మీ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *