మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతున్న అధికారులకు గ్రామస్తులు సహకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూపూడి గ్రామాన్ని రాష్ట్రంలోనే మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతున్న అధికారులకు గ్రామస్తులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా విజువల్‌ క్లీన్డ్‌ గ్రామంగా ఎంపికైన ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విజువల్‌ క్లీన్డ్‌ గ్రామంలో ఎంపికైన జూపూడిలో జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమానకి అధికారులతో పాటు గ్రామస్తులు భాగస్వామ్యులై చేయూతను అందించలన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించి ప్రతి ఇంటి ముందు చెత్త లేకుండా ఎప్పటికప్పుడు సమీపంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా కడుగుకోవాలన్నారు. మల మూత్ర విసర్జన అనంతరం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈనెల 5 ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రంణలో భాగంగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులకు బదులుగా పర్యావరణ అనుకూల నార, గుడ్డ సంచులను మాత్రమే ఉపయోగించాలన్నారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ చెత్తపేరుకు పోకుండా తొలగించి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి జూపూడి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం అవుదామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకట్రావు, డిపివో చంద్రశేఖర్‌, తహాశీల్థార్‌ ఎం. సూర్యారావు గ్రామ సర్ఫంచ్‌ కాకి దేవమాత, వైస్‌ ఎంపిపి బాణావతు నాగబాలమ్మ స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *