-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.20.11.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు గుడివాడలోని ముగ్గు బజార్ సెంటర్, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉన్న రెడ్సన్ ఫౌండేషన్ – DDUGKY శిక్షణ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు.
ఈ జాబ్ మేళాలో యాక్సెస్ బ్యాంక్ లిమిటెడ్, హెటేరో లాబ్స్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్, రాజేంద్ర ఎనర్జీ పవర్ సొల్యూషన్స్, జడ్ ఎఫ్ కమర్షియల్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కురకు ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అడేక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూస్టార్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని, 400కు పైగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి . నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, ఏదైన డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 20న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98488 19682, 84648 53703, 95732 78755 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
