-బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎ. మల్లికార్జున
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని బీసీ అభ్యర్థులకు డీఎస్సీ (DSC) పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఆన్‌లైన్ కోచింగ్ నిర్వహించే సంస్థల ఎంపానెల్‌మెంట్ కోసం అర్హత కలిగిన సంస్థల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎ. మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి కలిగిన ఆన్‌లైన్ కోచింగ్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ (https://tender.apeprocurement.gov.in) ద్వారా ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ టెండర్ డాక్యుమెంట్లను ఈ నెల 17వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి 24వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు ఇతర సమాచారం కోసం ఆసక్తి గల సంస్థలు డైరెక్టరేట్ ఆఫ్ బీసీ వెల్ఫేర్, విశాల్ రెసిడెన్సీ 2వ & 3వ అంతస్తు, పద్మజా నగర్, తాడిగడప, విజయవాడ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
అర్హత కలిగిన ఆన్‌లైన్ కోచింగ్ సంస్థలు నిర్ణీత గడువులోగా టెండర్ ప్రక్రియలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంచాలకులు ఆ ప్రకటనలో తెలిపారు.
