విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆగస్టులో ప్రత్యక్ష కార్యాచరణకు విజయవాడ కేంద్రంగా ఏపీయూడబ్ల్యూజే సిద్దమౌతుందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన బుధవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్, విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. జర్నలిస్టుల సంక్షేమకార్యక్రమాలను అమలు పర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, వాటి పరిష్కారం కోసం యూనియన్ ద్వారా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఇందుకు విజయవాడ వేదికగా మరోసారి పెద్ద ఎత్తున జర్నలిస్టులతో ఓ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు అందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టి ఆపై మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు కె. జయరాజ్, యూనియన్ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్, కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి. రామారావు, షేక్ బాబు, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, నగర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు, యూనియన్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ …