బాలల రక్షణపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు ఆపదలో ఉన్న బాలల రక్షణపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.

నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, ఫోరమ్ ఫర్ చైల్డ్ లైన్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరవండి పరిగెత్తండి చెప్పండి (SHOUT-RUN- TELL) వినాదాలతో ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను,గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసంపై 8 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియో క్లిప్ రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో, తహాసిల్దార్, గ్రామ వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, వసతి గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కూడళ్ళ వద్ద ఈ పోస్టర్లను శాశ్వతంగా ఉండేలా ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎవరైనా శరీర రహస్యభాగాలను తాకినా వెంటనే వారిని నిలువరించేందుకు బిగ్గరగా “అరవటం,” శరీర రహస్య భాగాలు తాకినా వారి స్పర్శ అసౌకర్యాన్ని భయాన్ని కలిగించినా వారి నుండి సాధ్యమైనంత దూరంగా “పరిగెత్తటం,” శరీర రహస్యభాగాలను తాకినా స్పర్శ అసౌకర్యాన్ని కలిగించినా తల్లితండ్రులకు,పెద్దవారికి తెలియజేసేవిధంగా “చెప్పండి” అనే వినాదాలతోను, చైల్డ్ లైన్1098, , ఉమెన్ హెల్ప్ లైన్ 181,పోలీసు100 హెల్ప్ లైన్ నెంబర్లపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా పోస్టర్లను ముద్రించడం జరిగిందన్నారు.

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి ఉమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. మంచి వ్యక్తిత్వం మనసున్న వ్యక్తులకు మంచి ఆలోచనలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును ఉద్దేశించి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు.

కలెక్టరేట్ ప్రాంగణంలో బాలలపై వేధింపులు అరికట్టడంపై రూపొందించిన పోస్టర్ల ప్రదర్శనను కలెక్టర్ ఢిల్లీ రావు స్వయంగా పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె సునీత, ఫోరం ఫర్ చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఆరవ రమేష్, జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *