విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు అన్నారు. అజాదికా అమృత మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పిం చేలా ఈ నెలా 27వ తేదీన మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడి వర్చువల్ విధానంలో హాజరయ్యే ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కలెక్టరేట్ విడియో కాన్ఫెరెన్స్ హాలు ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భ విష్య పవర్ 2047 మహోత్సవాలను దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎ.పి.సి.పి.డి.సి.ఎల్., ఎస్.ఇ. శివప్రసాద్ రెడ్డి, రూరల్ ఎల్ క్ట్రిఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజర్ ఎం.శోభన్ లు సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావును ఆయన కార్యాలయంలో కలిసి కార్యక్రమ వివరాలను వివరించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …