ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజములో మానవ హక్కులను కాపాడుకొని బాధ్యత మనదే నాని అలానే భారత రాజ్యంగా ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు నిగా షేక్. ఖలీఫాతుల్లాబాషా నియమితులైన సందర్భంగా ఒంగోలు లోని హాటల్ మౌర్య ఇన్ లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి ప్రెసిడెంట్ M.ఉషా అధ్యక్షత షేక్. ఖలీఫాతుల్లాబాషా కు ఆత్మీయ అభినందన సభ లో ముఖ్యఅతిథిలుగా రవిశంకర్ గ్రూప్ ఛైర్మన్ కంది రవి శంకర్, బ్రిలియంట్ గ్రూప్ ఛైర్మన్ షేక్. న్యామతుల్లా బాషా, మాజీ అడిషనల్ యస్.పి. సుంకర సాయిబాబా, రచయితల సంఘం అధ్యక్షురాలు టి.అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తూరు సుబ్బారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యంగా ఫలాలు ప్రతి ప్రతిఒక్కరికీ అందలసిందేనని అపుడే నిజమైన స్వతంత్రo వచ్చినట్లు అన్నారు.రాజ్యంగా ఆర్టికల్ ఒకటి నుంచి ముఫై దాకా భారత భారత ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే సమాజములో మానవ హక్కుల ఉలంఘన జరగకుండా అందరికి న్యాయం జరుగుతుందన్నారు. హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున షేక్. ఖలీఫాతుల్లాబాషా ఆధ్యర్యం లో ఆపదలో ఉన్న అభాగ్యులుకు నిత్యం అండగా నిలిచి వారిని అదుకోవడమే కాకుండా కరోన కష్టా కాలములో కరోన వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తలుతో వారికి కావలసిన మందులు, ఆహార సదుపాయాలు కల్పించడం ఆంధ్రనుంచి సౌదీఅరేబియా తో పాటు పలు విదేశాలకు వెళ్లి అరబ్ షేక్ కుల బారిన పడి చిత్రవధతో బాధ పడుతున్న అనేకమంది మహిళలలను షేక్ కుల చారనుంచి రక్షించి సొంత ఖర్చులతో వారివారి స్వగ్రామం లకు తీసుకొని వెళ్లి వారి కుటుంబాలకు అప్పగించి వారికి కావలసిన ఆర్ధిక సహాయం చేయడం మహిళ కౌన్సిల్ తరుపున చట్ట పరిధిలో మనస్పర్థలు తో నలిగిపోతున్న అనేక మంది భార్య భర్తల ను కలిపి వారి కుటుంబాలను అండగా నిలిచి విద్యార్థులకు ఆర్ధిక సహాయం,పేద మహిళ లకు జీవన ఉపాధి కోసం కుట్టు మిషెన్లు ఇచ్చి ఆదుకోవడం ఇలా చేసిన అనేక సేవా కార్యక్రమాలును దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులైన షేక్. ఖలీఫాతుల్లాబాషా అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజ సేవతో పాటు మానసిక రుగ్మతలకు లోనై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను ఆశ్రయించినవరికి అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా మంచి పేరు తెచ్చుకుని జాతీయస్థాయిలో ఎదిగినా షేక్. ఖలీఫాతుల్లాబాషా ను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రలా టీమ్ సభ్యులు తదితర మిత్రులు అభినందనoలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ బిల్లాల్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి రాష్ట్ర వైస్ ఛైర్మన్ ఆర్.జ్యోతి, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒర్కిగ్ ప్రెసిడెంట్ రత్నకుమారి, హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమెన్ ప్రోటాక్షన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హైమవతి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కార్యదర్శి పఠాన్. సాదిజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News