Breaking News

సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం… : మంత్రి జోగి రమేష్

-ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ పథకాలను వివరణ
-గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన ..

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు ప్రయోజనాలే పరమావధిగా, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
పెడన నియోజకవర్గం లోని పెడన టౌన్ లో 2 వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చేపట్టారు. ఆయనకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని దీవిస్తున్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, వార్డులో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఫలానా పథకం మీకు అందుతున్నాయా అని పలువురిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డిని, తనను ఆశీర్వదించమని పలువురిని పెద్దలను కోరారు. పెడన పట్టణంలోని 2 వ వార్డు పిచ్చుకవారి వీధిలో ( భజన గుడి సందు) తొలుత ఆయన బళ్లా వెంకటేశ్వరమ్మ, బళ్ళా శ్యామలరావు,గుత్తి సుబ్రమణ్యం, బూరగడ్డ భాస్కరరావు, కట్టా భాగ్యలక్ష్మి తదితరులకు చెందిన 350 మంది ఇళ్లకు తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ,ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు , హామీలీవ్వటమే కానీ అమలు చేయని ప్రస్తుత రాజకీయాల్లో ఇదిగో నేను అమలు చేసిన హామీలు అని ప్రజల ముంగిటకు సగర్వంగా వెళ్తున్నామని , ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి ప్రజల వద్దకు వెళ్లే దమ్మున్న ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూసి ఉండరని అన్నారు.. ఏ ముఖ్యమంత్రి అందించని విధంగా నవరత్నాలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు..అనంతరం స్థానిక వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు..

పెడనలో తీరనున్న లో వోల్టేజ్ సమస్య
పెడన నియోజకవర్గంలో లో-వోల్టేజ్ సమస్య నివారించటానికి రెండు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయటానికి మంత్రి జోగి రమేష్ ,ఎనర్జీ సెక్రటరీతో విజయనందం, ఏ పి ట్రాన్స్ కో సి ఎం డి శ్రీధర్ తో ఈ సమస్య పరిష్కారం కోసం మాట్లాడారు. ఆ ఇరువురు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి త్వరలోనే సర్వే చేయించి రెండు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పెడన ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ మధుసూధనరావు, విద్యుత్ శాఖ ఏ ఈ సాంబశివరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *