విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
2027 సంవత్సరంలో భారత దేశ జనాభా గణన ప్రారంభమవుతోంది. మొదటి దశలో ఇండ్ల జాబితా సేకరించడం జరుగుతుంది. రెండవ దశలో కుటుంబాల గణన, జనాభా గణన సేకరించడం జరుగుతుంది. ఈ జనాభా సేకరణలో అనేక వివరాలని సేకరించడం ఉంటుందని, వాటితో పాటు కులం, మతం గురించి కూడా సేకరించడం ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా సెన్సస్ మాస్టర్ ట్రైనర్ డాక్టర్ కొల్లేటి రమేష్ నాస్తిక కేంద్రంలో జరిగిన సభలో వివరించారు. భారత దేశ జనాభా గణన 2027 అధికారక మాన్యువల్ ప్రకారం ప్రకరణ 9లోని విధంగా కుటుంబ సభ్యునికి మతం లేదని లేదా మతాన్ని పేర్కొనడానికి ఇష్టపడటం లేదని తెలిపినట్లయితే, ఆ కాలంలో “మతం లేదని” నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ప్రకరణ 10లోని 14వ క్లాజ్ ప్రకారం కులం నమోదు విషయంలో సమాధానమిచ్చే వ్యక్తి కులం లేదు అని తెలిపిన సందర్భంలో అదే నమోదు చేయాలని ఉందని పేర్కొన్నారు. కులం, మతం లేని నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు, అభ్యుదయవాదులు స్వచ్చందంగా తమకి కులం, మతం లేదని పేర్కొనాలంటే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి జనాభా గణన చేయు సందర్భంలో నిస్సందేహంగా కులం, మతం లేదని పెర్కొనవచ్చని అన్నారు. వెబ్ పోర్టల్ లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ పద్ధతి ద్వారా కూడా అన్నీ వివరాలని నమోదు చేయవచ్చన్నారు.
జనాభా గణనలో స్వచ్చందంగా కులం లేదు, మతం లేదు అని రాయవచ్చు
