-సాధారణ చిరు ఉద్యోగి విద్యార్థులకు అందిస్తున్న సహకారం స్పూర్తిదాయకం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచి బోదనను అందించడం ద్వారా ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు మంచి పునాదిని వేస్తున్నామని విద్యా రంగ అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. అజింత్ సింగ్ నగర్ ఇందిరానాయక్ నగర్‌కు చెందిన రిటైర్డ్ పోస్టుమెన్ సహకారంతో బుధవారం పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు జామెంటరి బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి నాడు`నేడు కార్యక్రమం ద్వారా మూడు దశలలో పాఠశాలలో మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. మొదటి దశలో రూ.78.33 కోట్ల రూపాయల నిధులతో 325 పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామన్నారు. రెండవ దశలో 465 పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు 898 అదనపు తరగతి గదులకు రూ. 213 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రూపొందిస్తున్నామన్నారు. విద్య పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దాతల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, అదనపు తరగతి గదులు, అధునిక మరుగుదొడ్లు నిర్శిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ప్రాధమిక దశ నుండే గట్టి పునాది వేసేందుకు స్కూల్ టీచర్లకు ఆదునిక విద్య బోదనపై శిక్షణ అందించి పాఠ్యంశాలు బోధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ విరమణ చేసిన పోస్టుమెన్ ఆర్. రామచంద్రరావు గత 25 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పేద విద్యార్థుల ఉన్నత విద్యాకు సహకరించేందుకు దాతలు ముందుకురావాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
స్థానిక శాసనసభ్యులు మల్లాధివిష్ణువర్థన్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 33 కోట్ల రూపాయలతో సుమారు 160 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జగనన్న విద్యా దీవన, అమ్మఒడి, విద్యాకానుక తదితర పథకాలను అమలు చేయడం ద్వారా ప్రతీ పేద విద్యార్థికి ఉన్నత చదువులు అందించాలనదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రిటైర్డ్ పోస్టుమెన్ రామచంద్రరావు మాట్లాడుతూ తాను సంపాదించిన దానిలో కొంత పేద విద్యార్థులకు ఖర్చు చేసి నోటు పుస్తకాలు, పెన్నులు, జామెంటరి బాక్సులు, స్టీల్ ప్లేట్లు, గ్లాస్సులు, పారిశుద్ద్య కార్మికులకు దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్థానికులు చుక్కపల్లి సంకేత్‌బాబు, బసివిరెడ్డి, వై శ్రీనివాసరెడ్డి, ఎల్. శంకర్, రత్నకార్‌రెడ్డి , యం.కె.బేగ్, ప్రశాంతి పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.