Breaking News

దేశంలోనే ప్రప్రధమంగా అమలులోకి ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్(APOLCMS)ను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. బుధవారం అమరావతి రాష్ట్ర సచివాలయం సియం సమావేశ మందిరంలో ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ పై సిఎస్ అధ్యక్షతన కార్యదర్శులు, అడ్వకేట్ జనరల్,జిపిలతో సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ కోర్టుల్లో ఫైల్ అయ్యే కేసులపై సంబంధిత శాఖలు సకాలంలో స్పందించి జిపిలతో సన్వయం చేసుకుని వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.కోర్టుల్లో నమోదయ్యే కేసుల్లో 50శాతం వరకూ ఆర్ధికేతర అంశాలకు సంబంధించినవే ఉంటాయని సకాలంలో ఆయా కేసులకు సంబంధించి సమాధానాలు ఇవ్వగలిగితే కోర్టు కేసుల పెండెన్సీ తగ్గడంతో పాటు కోర్టు దిక్కార సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. నమోదైన కేసులపై ఏవిధమైన చర్యలు తీసుకోకుండా ఉంటే ఇబ్బందులు ఎదరువుతాయని అన్నారు.కోర్టు కేసులపై అధికారులకు అవగాహన,నిరంతర పర్యవేక్షణ,సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం ఎజి సహా జిపిలతో సమన్వయం ఉండే రీతిలో దేశంలోనే ప్రప్రధమంగా రాష్ట్రంలో ఎపి ఆన్లైన్ లీగల్ కేసులు మేనేజిమెంట్ సిస్టమ్ ను రూపొందించి అమలులోకి తెచ్చినట్టు చెప్పారు.ఈవిధానం వల్ల ఆయా కేసులపై సంబంధిత శాఖల పరిధిలో సత్వర చర్యలు తీసుకోవడానికి కేసుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెల్సుకునేందుకు అవకాశం కలుగుతుందని సిఎస్ డా.సమీర్ శర్మ స్పష్టం చేశారు.ఈనూతన విధానంతో కేసు ఫైల్ అయిన వెంటనే సంబంధిత శాఖాధికారులు తెల్సుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.అలాగే సంబంధిత శాఖ జిపిలు కూడా ఆయా శాఖ కార్యదర్శులకు తెలియజేస్తారని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ కోర్టులో కేసు నమోదైన వెంటనే సంబంధిత జిపి ఆయా శాఖ అధికారికి తదుపరి చర్యల గురించి వివరించాలని చెప్పారు.అలాగే సంబంధిత లైజన్ అధికారి ఆయా కేసు గురించి అధికారుల దృష్టికి తెచ్చి సకాలంలో తదుపరి కార్యాచరణ చర్యలు తీసుకునేలా చూడాలని అన్నారు.అదే విధంగా సంబంధిత శాఖ అధికారి కూడా వెంటనే జిపిని సంప్రదించి ఆయా కేసుపై ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై వారి అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.అంతేగా జిపి కోర్టు ఆర్డర్ కాఫీని ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు.కోర్టు కేసు నమోదైన వెంటనే ఆయా కేసుపై ఆయా శాఖ కార్యదర్శి,సెక్షన్ అధికారి,లైజన్ అధికారి తదితరులు ముందుగా ఆకేసుకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించుకోవాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు.
అంతకు ముందు సిసిఎల్ఏ కార్యదర్శి అహ్మద్ బాబు ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది దేశంలోనే మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.ఇ-కోర్టు విధానానికి అనుగుణంగా వివిధ కోర్టు నమోదయ్యే కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు.అదే విధంగా డిజిటల్ విధానంలో కౌంటర్లు ఫైల్ చేసేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ను కూడా రూపొందించాని దానిని ఎజి,జిపిలు,సంబంధిత శాఖల కార్యదర్శులు,లైజన్ అధికారులతో అనుసంధానించడంతో ఆయా కేసుల స్టేటస్ ను తెల్సుకుని సకాలంలో చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.అంతేగాక డ్యాష్ బోర్టు ద్వారా కూడా ఆయా కేసుల స్థితిగతులను తెల్సుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు.డ్యాష్ బోర్డులో క్లిక్ చేసిన వెంటనే కేసు వివరాలు,ఇంటెర్మ్ ఆర్డర్,ఫైనల్ ఆర్డర్ వంటి అన్ని అంశాలు తెల్సుకోవచ్చని వివరించారు.దీనిపై రాష్ట్ర హైకోర్టు సహకారంతో జిపిలు తదితరులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.ఈవిధానాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా 1300 మంది వరకూ నోడల్ అధికారులు రిజిష్టర్ కావడం జరిగిందని చెప్పారు.ఇంకా ఈవిధానానికి సంబంధించిన పలు అంశాలపై బాబు ఎ సమావేశంలో జిపిలు,కార్యదర్శులకు వివరించారు.
ఈ సమావేశంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్టూటర్ వై.నాగిరెడ్డి,అదనపు పిపి ఎస్.దుష్యంత్ రెడ్డి,ఇంకా పలువురు జిపిలు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *